Header Banner

ఏయూలో అక్రమ నియామకాల రహస్య ఛాప్టర్! కవర్ అవుతున్న అసలు కథ ఏమిటంటే?

  Fri Mar 14, 2025 08:24        Others

ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లోగా విజిలెన్స్‌ విచారణ పూర్తిచేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఏయూలో జరిగిన అక్రమాలపై అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. రూసా నిధుల దుర్వినియోగం, ఇస్రో నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘన, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు వినియోగించడం వంటి ఆరోపణలు వచ్చాయని వివరించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ నియామకాలు, అవినీతి, విద్యార్థుల రాజకీయ దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని విజిలెన్స్‌ను ఆదేశించనున్నట్లు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

ఏయూలో జరిగిన అక్రమాలపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ప్రొఫెసర్ల నియామకాలు జరిపారని, తనకు నచ్చని వారి మీద అనవసర చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఆయన హయాంలో వర్సిటీ సెనేట్‌ హాలును రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చారని, జగన్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్ కోసం వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో వందేళ్ల నాటి చెట్లను నరికేశారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. మద్యం, డ్రగ్స్‌ వంటి అనుచిత కార్యకలాపాలు యూనివర్సిటీలో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని, వర్సిటీ భూములను ఆక్రమణదారుల నుండి రక్షించాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

 

ఈ అవినీతి, అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఏయూలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రాధాన్యతనిస్తామని, ఖరగ్‌పూర్‌ ఐఐటీలో మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన రాజశేఖర్‌ను వీసీగా నియమించినట్లు తెలిపారు. ఏయూ విద్యా ప్రమాణాలను పెంచి, వర్సిటికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని, వర్సిటీలను పూర్తిగా శుద్ధి చేసి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Andhrapradesh #AndhraUniversityScam #CorruptionInvestigation #AUProbe #JusticeForEducation #VigilanceAction